చైనా మాంజా విక్రయాలపై నివేదిక ఇవ్వండి

– హైదరాబాద్‌ ‌సీపీ ని ఆదేశించిన మానవ హక్కుల కమిషన్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 13: చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ‌సీరియస్‌ అయింది. దీనిపై ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక సమర్పించాలని హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ను ఆదేశించింది. బ్యాన్‌ ‌చేసిన చైనా మాంజా వాడకం వల్ల జరుగుతున్న గాయాలు, మరణాలపై హ్యూమన్‌ ‌రైట్స్ అడ్వకేట్‌ ఇమ్మానేని రామారావు తెలంగాణ స్టేట్‌ ‌హ్యూమన్‌ ‌రైట్స్ ‌కమిషన్‌లో పిటిషన్‌ ‌దాఖలు చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 30‌న దాఖలైన ఈ పిటిషన్‌లో చైనా మాంజా పూర్తిగా నిషేధించాలని, విక్రయాలు, ఉపయోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా చైనా మాంజా వల్ల తీవ్రమైన గాయాలు, మరణాలు సంభవిస్తున్నాయి.. కీసరలో జశ్వంత్‌ ‌రెడ్డి అనే ఓ బాలుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.. షమ్షేర్‌గంజ్‌లో జల్‌ అనే వ్యక్తి మెడ చుట్టూ లోతైన కోతపడి సుమారు 22 కుట్లు పడ్డాయి.. ఈ మాంజా గాజు లేదా మెటల్‌ ‌కోటింగ్‌తో తయారవుతుంది.. దీనిని పతంగుల పోటీల్లో ఉపయోగిస్తుంటారు.. ఇది చాలా ప్రమాదకరమైనది అని పిటిషనర్‌ ‌విన్నవించారు. చైనా మాంజాపై పూర్తి నిషేధం అమలు చేయాలని, ఈ-కామర్స్ ‌వెబ్‌సైట్లలో దీని అమ్మకాలపైనా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు కోరుతున్నారు. కాగా, ఇటీవల హైదరాబాద్‌ ‌పోలీసులు చైనా మాంజా విక్రయాలపై దాడులు చేసి రూ.1.24 కోట్ల విలువైన స్టాక్‌ ‌సీజ్‌ ‌చేశారు. 143మందిని అరెస్ట్ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *