రెపో రేటు మరో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

– ఆర్‌బిఐ మరోమారు కీలక నిర్ణయం
– తాజా నిర్ణయంతో రుణాలపై తగ్గనున్న వడ్డీలు

ముంబై, డిసెంబర్‌ 5: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి శుభవార్త ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మరో 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్టు తెలిపింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈమేరకు ద్రవ్య పరపతి విధాన సవిూక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా శుక్రవారం వెల్లడిరచారు. ఈ ఏడాదిలో ఇప్పటికే వడ్డీ రేట్లపై ఆర్బీఐ ట్రిపుల్‌ బొనాంజా ప్రకటించింది. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లపై 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. తర్వాత జూన్‌లో ఏకంగా 50 పాయింట్ల మేర కోత విధించింది. దీంతో 2025లోనే మొత్తం రెపో రేటు 1.25 మేర తగ్గింది. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి పడిపోవడం, వృద్ధి రేటు పెరగడంతో రేట్ల కోత చేపట్టినట్లు మల్హోత్రా వెల్లడిరచారు. వడ్డీ రేట్లను తగ్గించడంతో గృహ, వాహన రుణ గ్రహీతలకు మరికొంత ఉపశమనం లభించింది. జీఎస్‌టీ హేతుబద్ధీకరణతో కొనుగోళ్లు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 8.2శాతం వృద్ధి నమోదైంది. దీంతో 2025-26కిగాను వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచుతున్నాం.. ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టింది.. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాలను 2.6శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నాం అని ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు. రూ.లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీస్‌ విక్రయాల కోసం ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకులు తమ లోన్‌ వడ్డీ రేట్లను త్వరలోనే సవరించనున్నాయి. ఫలితంగా హోమ్‌, కారు, పర్సనల్‌ లోన్‌లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. ఇది సామాన్యుడికి గొప్ప ఊరట కలిగించే నిర్ణయమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో హోమ్‌ లోన్‌ ఖాతాదారుల చెల్లింపు విధానం ఎలా ఉంటుందో ఓసారి పరిశీలిస్తే.. 8.5 శాతం వడ్డీ రేటుతో 15, 20, 25 ఏళ్ల చొప్పున కట్టేందుకు తీసుకున్న లోన్‌ 25 బేసిస్‌ పాయింట్ల రెపో రేటు తగ్గింపుతో 8.25 శాతం వడ్డీతో కట్టాల్సి ఉంటుంది. రూ.25 లక్షలు హోమ్‌ లోన్‌ 15 ఏళ్ల కాల పరిమితితో తీసుకుంటే గతంలో 8.5 శాతం వడ్డీతో రూ.24,254 ఈఎంఐ కట్టాల్సి ఉండేది. ప్రస్తుతం 8.25 శాతం వడ్డీతో రూ.24,254 ఈఎంఐ చెల్లిస్తే చాలు. మొత్తం కాల పరిమితిలో రూ.65,696 ఆదా చేసుకునేందుకు వెసులుబాటు ఏర్పడిరది. ఇదే రూ.25 లక్షల మొత్తాన్ని 20 ఏళ్ల కాల పరిమితికి తీసుకుంటే గతంలో రూ.21,696 ఈఎంఐ కట్టాల్సి ఉండగా తాజాగా రూ.21,302 చెల్లించాలి. మొత్తవ్మిూద రూ.94,545 సొమ్ము ఆదా కానుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *