అద్దె కల

మీ ఊరిలోనే
నా నిజమొకటి
అద్దె కలతో కాపురముంటుంది

నేను వచ్చినప్పుడు అక్కడే దిగుతాను
సమయాన్ని ఖర్చు పెట్టి
కొనుక్కునే ఓ తృప్తి
అక్కడే దొరుకుతుంది

వెళ్ళేటప్పుడు ఉన్న కుర్రతనం
వచ్చేటప్పుడు దొంగలు పడినట్టుగా
పోగొట్టుకుని వస్తాను

మళ్ళీ మళ్లీ పొందాలని వెళుతుంటాను
కానీ ఆ కల కాపురం అక్కడే
మనసు మాత్రం ఎక్కడో

-శ్రీ సాహితీ

***********

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *