నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలి

– ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి
– కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మార్చి 10: ప్రతీ ప్రభుత్వ కార్యాలయం నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం స్వచ్చత- పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లోని నీటి పారుదల శాఖ, ఈఈ పీఆర్, ఆరఅండ్‌బీ, బీసీ సంక్షేమ శాఖ, డీటీ సీపీఓ, కార్మిక శాఖ, భూగర్భ శాఖ, డీఆర్ డీఓ, మైనింగ్, సీపీఓ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, ఎక్సైజ్, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా పంచాయతీ ఆఫీస్, ట్రెజరీ శాఖ, ఏవో ఆఫీస్, డీపీఆరఓ, సంక్షేమ శాఖ తదితర కార్యాలయాలను కలెక్టర్ గరిమ అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని వివిధ గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతీ జిల్లా శాఖ కార్యాలయం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయంలోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్ రూమ్‌లలో నిబంధనల ప్రకారం భద్రపరచాలని, అనవసరమైనవి తొలగించాలని సూచించారు. కార్యాలయం ఆవరణలోని నిరుపయోగ వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు తొలగించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న కుండీల్లో మొక్కలు పెట్టించాలని కలెక్టర్ తెలిపారు. పరిశీలనలో కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *