దేవస్థానం పరిధిలో ఫ్లెక్సీలు తొలగించాలి

– ఆలయ ఈవోకు బీజేపీ వినతి పత్రం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23: యాదగిరిగుట్ట దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఆలయ ఈవో వెంకటరావుకు బీజేపీ శ్రేణులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీి పట్టణ శాఖ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌ మాట్లాడుతూ కొండ కింద సింహ ద్వారం వద్ద గతంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దు అని ఈవో అన్ని పార్టీల అధ్యక్షులకు నోటీస్‌ ఇచ్చారన్నారు. కానీ అది అమలు కావడం లేదని తెలిపారు. యాదగిరిగుట్టకు కాంగ్రెస్‌ నాయకులు, మంత్రులు వస్తున్నారని గోపురానికి అడ్డంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలను కించపరిచారన్నారు. ఈవో కంటికి ఈ ఫ్లెక్సీలు కనిపించ లేదా లేక చూసీచూడనట్టు ఉన్నారా అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నీతులు చెప్పడం కాదు పాటించాలని హితవు పలికారు. గతంలో కూడా అనేకసార్లు ఇలానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ యాదగిరిగుట్ట దేవస్థానం కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌ కాదు.. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు సత్యం, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ చంద్రమౌళి, పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజు నరేష్‌, కార్యదర్శులు ఆలేటి కర్ణ, సురేష్‌, సత్యనారాయణ, సీనియర్‌ నాయకులు లెంకలపల్లి శ్రీను, రాజిరెడ్డి, అజయ్‌, వంశీ, ప్రవీణ్‌, సాయి, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *