ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఓట్ల తొలగింపు

– ఇతర రాష్ట్రాల ఫోన్లు ఉపయోగించారు
– ఒక రాష్ట్రం తరవాత మరో రాష్ట్రం
– కాంగ్రెస్‌కు పడే ఓట్ల జాబితా గుర్తింపుతోనే చేశారు
– మీడియా సమావేశంలో మరో బాంబ్‌ పేల్చిన రాహుల్‌

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 18: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని విమర్శించారు. రాష్ట్రం వెలుపలి నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్‌ నంబర్లను ఉపయోగించి ఓటర్‌ ఐడీలను తొలగించినట్లు, సాప్ట్‌వేర్‌ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు దిల్లీలో విూడియా సమావేశంలో ఆరోపించారు. ఓట్ల తొలగింపు అంతా వ్యక్తులతో కాకుండా సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి చేస్తున్నారు.. అదంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతోంది.. ప్రతిపక్షాలకు ఓట్లు వేసే కమ్యూనిటీలను మరీ ముఖ్యంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి తాము 100 శాతం ఆధారాలను గుర్తించామని చెప్పారు. త్వరలో ఎన్నికల సంఘంపై హైడ్రోజన్‌ బాంబ్‌ పేల్చబోతున్నట్లు ప్రకటించినట్టుగానే గురువారం రాహుల్‌గాంధీ బాంబు పేల్చారు. ఓట్ల చోరీపై గతంలో కొన్ని ఆధారాలు బయటపెట్టగా ఈరోజు మరిన్ని ఆధారాలను విూడియా ముందు వీడియో ప్రజెంటేషన్‌ ద్వారా బయటపెట్టారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లు తొలగించాలని కొంతమంది కంకణం కట్టుకున్నారని, దానికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే ఈసీ కళ్లప్పగించి చూస్తోందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోతే ఇంకొక రాష్ట్రంలో.. ఇలా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సమయానికి లక్షలాది ఓట్లను తొలగిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఇందుకు ప్రత్యేక ఉదాహరణగా 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపుడు కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంక్‌ ఉన్న బూత్‌ల నుంచి వేలాది ఓట్లు తొలగించినట్లు వెల్లడిరచారు. వేరే రాష్ట్రాల ఫోన్‌ నెంబర్లు, నకిలీ లాగిన్‌లు ఉపయోగించి ఓటర్‌ు పేర్లు తొలగించారన్నారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాను. ప్రజాస్వామ్య పక్రియను ప్రేమిస్తున్నాను. నేను ఆ పక్రియను రక్షిస్తున్నాను. విూరు నిర్ణయించగల 100 శాతం రుజువు ఆధారంగా కాక నేను ఇక్కడ ఏవిూ చెప్పబోవడం లేదు. తీర్పు విూదేనని రాహుల్‌ గాంధీ అన్నారు. కర్ణాటకలోని అలంద్‌ నియోజకవర్గంలో ఎవరో 6,018 ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారని, చివరికి ఎవరో పట్టుబడ్డారని తెలిపారు. ఇది చాలా నేరాల్లో మాదిరిగానే యాదృచ్ఛికంగా పట్టుబడినట్లు తెలిపారు. ఈ తొలగింపు ప్రయత్నాలు కేవలం కాంగ్రెస్‌ పార్టీ గెలిచే బూత్‌ల్లోనే జరిగిందని వివరించారు. గోదాబాయి పేరుతో ఎవరో నకిలీ లాగిన్‌ సృష్టించి 12 మంది ఓటర్ల పేర్లు తొలగించారన్నారు. కానీ ఈ విషయం ఆమెకు తెలియదన్నారు. వారంలోపు ఈసీ డేటా విడుదల చేయాలని, లేకపోతే ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నవారిని రక్షిస్తున్నారని భావించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ చేస్తున్న అభ్యర్థనలను విస్మరిస్తున్నారని అన్నారు. కాగా, ఈ విమర్శలను ఎన్నికల సంఘం, బీజేపీలు ఖండిరచాయి. బాంబ్‌ తుస్సుమందని బీజేపీ ఎద్దేవా చేసింది.

సాఫ్ట్‌వేర్‌తో ఓట్ల తొలగింపు అసాధ్యం :ఈసీ
అబద్దాల ప్రచారంతో అస్థిరత సృష్టించే యత్నం :బీజేపీ

ప్రత్యేక సాప్ట్‌వేర్‌ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండిరచింది. అదంతా నిరాధార, అసత్య ప్రచారమని వెల్లడిరచింది. ఆన్‌లైన్‌ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. 2023లో అలంద్‌ నియోజవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయి. ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసం ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసింది. రికార్డుల ప్రకారం అలంద్‌ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా 2023లో కాంగ్రెస్‌ నేత బీఆర్‌ పాటిల్‌ గెలుపొందారని ఈసీ వెల్లడిరచింది. ఇదిలావుంటే ఓట్ల తొలగింపు అంటూ రాహుల్‌ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ మండిపడిరది. రాహుల్‌కు రాజ్యాంగం, చట్టం అర్థం కావడం లేదు. 2014 నుంచి మోదీ సాధిస్తున్న విజయాలన్నీ నిజం కావని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజలకు, ఓటర్లకు అవమానం. ఆయన బాంబు గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ఓటమిని చవిచూస్తున్నారు. ఈ సమయంలో వారు చేయాల్సింది దానిని అంగీకరించడం. కష్టపడి విూ స్థాయికి వస్తామనేలా వారి మాటలు ఉండాలి. దానికి బదులుగా వారు కోర్టుల జోక్యాన్ని కోరుకుంటున్నారు. లేకపోతే వేరొకరిపై నిందలు వేస్తున్నారని దిల్లీ మంత్రి మజీందర్‌ సింగ్‌ సిర్సా మండిపడ్డారు. బంగ్లాదేశ్‌, నేపాల్‌ తరహా అశాంతి భారత్‌లో సృష్టించాని రాహుల్‌ భావిస్తున్నారని కమలం పార్టీ నేత అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపు 90 ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని, దాంతో ఆయన అసహనం రోజురోజుకూ పెరుగుతోందని ఎద్దేవా చేశారు. క్షమాపణలు కోరడం, కోర్టు మందలింపులు ఆయనకు పరిపాటిగా మారిపోయాయన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *