– తొలిరోజు 277 కుక్కల పట్టివేత
– స్టెరిలైజేషన్ అనంతరం జంతు సంరక్షణ కేంద్రాలకు తరలింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: పాఠశాలలు, హాస్పిటల్స్, క్రీడా సముదాయాలు, రవాణా కేంద్రాలు వంటి ప్రజా ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీం కోర్టు శుక్రవారం ఇచ్చిన ఆదేశాలపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సత్వరమే స్పందించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం ప్రారంభించింది. డ్రైవ్ మొదటి రోజైన శనివారం మొత్తం 277 వీధి కుక్కలను పట్టుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) అనంతరం ఈ కుక్కలను జీహెచ్‌ఎంసీకి చెందిన జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. అక్కడ వాటికి టీకాలు, సంరక్షణ, పర్యవేక్షణ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ తొలుత ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ప్రారంభించి తరువాత పాఠశాలలు, కళాశాలలు, రవాణా కేంద్రాలు వంటి ఇతర పబ్లిక్ ప్లేస్‌లకు విస్తరించనున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



