polluting industries: కాలుష్యకారక పరిశ్రమల తరలింపును వేగవంతం చేయండి

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 12: కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలో ఆదాయ వనరుల సమీకరణ సమావేశాన్ని కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యుడైన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి నిర్వహించారు. కమర్షియల్‌ టాక్స్‌, మైనింగ్‌ శాఖల్లో ఆదాయ ఆర్జనలో మెరుగైన పనితీరు ప్రదర్శించిన అధికారులను కేబినెట్‌ సబ్‌ కమిటీ సభ్యులు అభినందించారు. సమావేశంలో రాజీవ్‌ స్వగృహ, హౌసింగ్‌ బోర్డు శాఖలో ప్రభుత్వ ప్రతిపాదనలుI ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఆర్‌అండ్‌బి స్పెషల్‌ సెక్రటరీ వికాస్‌ రాజ్‌, కమర్షియల్‌ టాక్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రిజ్వీ, ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌, రెవెన్యూ-సీసీఎల్‌ఏ సెక్రటరీ లోకేష్‌ కుమార్‌, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ హరికిరణ్‌, హౌసింగ్‌ వీసీ అండ్‌ ఎండీ గౌతం తదితరులు పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రితో యూకే ప్రతినిధి బృందం భేటీ

రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో యూకే ప్రతినిధి బృందం మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణలో మాల్స్‌, హాస్పిటల్స్‌, హోటల్స్‌ రంగాల్లో పెట్టుబడులపై ఉప ముఖ్యమంత్రితో ఈ బృందం చర్చించింది. మంత్రులను కలిసిన వారిలో జైల్స్‌ మెంబ్రే, మార్క్‌ అప్టన్‌, కోనాల్‌ ఫెరెట్‌, నాగెన్‌ సనత్‌కుమార్‌, సాయిరత్నాకర్‌ పెంటపాటి, ఫణి గుడివాడ, అభి కొమ్సాని తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *