సుప్రీంకోర్టులో రాహుల్‌ గాంధీకి ఊరట

– భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసు
– ట్రయల్‌ కోర్టు చర్యలను నిలిపివేసిన ‘సుప్రీం’

న్యూదిల్లీ, డిసెంబర్‌ 3: భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ఉపశమనం లభించింది. ఆయనపై ట్రయల్‌ కోర్టు చర్యలను గురువారం నిలిపివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వచ్చే ఏప్రిల్‌ 22 వరకు పొడిగించింది. రాహుల్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎం.ఎం.సుందరేష్‌, జస్టిస్‌ సతీష్‌ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ అంశాన్ని వివరంగా విచారిస్తామని తెలిపింది. 2022లో చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ భారత సైన్యంపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఫిర్యాదుదారు ఉదరు శంకర్‌ శ్రీవాస్తవ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు సమన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ రాహుల్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు మే 29న కొట్టివేసింది. ఈ ఉత్తర్వులపై రాహుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 4న రాహుల్‌ గాంధీ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ తేదీ వరకు స్టే విధించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *