– వారికి కూడా ‘రైతుభరోసా’
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రేవంత్ సర్కార్ భారీ ఊరటనిచ్చింది. ఇప్పటివరకు పాత లబ్దిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా పొందిన సుమారు 85 వేల మంది రైతులు ఉన్నారని అంచనా వేయగా, వారిలో ఇప్పటికే 62 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను వ్యవసాయ శాఖ ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రైతుల అర్హత, భూమి వివరాలు, పట్టాదారుల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత వారం, పది రోజుల్లో తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. అర్హులుగా తేలిన కొత్త రైతులకు ఏప్రిల్ 15-20 తేదీల మధ్య యాసంగి రెండో విడత రైతు భరోసా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సీజన్‌లో సుమారు రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్‌లో లబ్ది పొందిన ప్రతి రైతుకు ఈ యాసంగిలో కూడా కోతలు లేకుండా పూర్తిస్థాయి పెట్టుబడి సాయం అందనుంది. 2025`26 ఖరీఫ్‌లో సుమారు 69.39 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్ప్పున మొత్తం రూ. 8,744.13 కోట్లను కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే పంపిణీ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రైతు భరోసా లబ్దిదారుల సంఖ్యలో నల్లగొండ జిల్లా 5.22 లక్షల మందితో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో సంగారెడ్డి (3.53 లక్షలు), ఖమ్మం (3.35 లక్షలు), సిద్ధిపేట (3.18 లక్షలు) జిల్లాలు ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





