తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది. పంట నష్ట పరిహారం నిధులను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం ద్వారా రైతులకు ఊరట కలిగించింది. ఇటీవల వడగంట్ల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 29 జిల్లాల్లోని 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా నివేదిక ప్రచారం ప్రభుత్వం రూ. 51.52 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మే నెలకు పంట నష్టపరిహారం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు.
అకాల వర్ష బాధిత రైతులకు ఊరట -నష్టపరిహారం విడుదల




