డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట

– నియాకంపై సవాల్‌ ‌పిటిషన్‌ ‌కొట్టివేత

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 9: డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్‌ ‌చేయాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించారంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.మద‌న్‌గోపాల్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం డీజీపీ నియామక ఉత్తర్వులపై స్టే విధించడానికి నిరాకరించింది.రెగ్యులర్‌ ‌ప్రాసెస్‌ను నాలుగు వారాల్లో పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌పక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. యూపీఎస్‌సీకి పంపిన తర్వాత కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
—————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *