హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హైకోర్టులో ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. 2023లో భూపాలపల్లి పర్యటన సందర్భంగా సీఎం దేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తనపై రేవంత్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేశారని మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో గండ్ర వెంకటరమణారెడ్డి రెండు ఫిర్యాదులు చేశారు. అయితే ఈ కేసులను కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా భూపాలపల్లి కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణకు స్వీకరించిన కోర్టు భూపాలపల్లి కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. అంతకుముందు కౌంటర్ దాఖలుకు గండ్ర వెంకటరమణారెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





