హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న అర్హత గల జీవిత ఖైదీలను తక్షణమే ముందస్తు విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్‌ఎఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీవిత ఖైదు సహా వివిధ శిక్షలనుభవిస్తున్న ఖైదీలకు రెమిషన్, ముందస్తు విడుదల విధానంపై స్పష్టమైన పాలసీ రూపొందించాలంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఫిబ్రవరి 18న సుమోటో రిట్ పిటిషన్ క్రిమినల్ నం.4/2021తోపాటు ఎసఎల్‌పీ (క్రిమినల్) నం.529/2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపింది. ఈ ఆదేశాలÅ£నుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖ ద్వారా జీవిత ఖైదీలకు ప్రత్యేక రెమిషన్ మంజూరు చేయడానికి సంబంధించి శాశ్వత మార్గదర్శకాలను నిర్ధారిస్తూ అక్టోబర్ 27న జీవో 126ను జారీ చేసిందని, అర్హత గల జీవిత ఖైదీలను గుర్తించడం, వారి కేసులను ముందస్తు విడుదలకు పరిశీలించడంపై అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రమాణాలను అందులో స్పష్టంగా పేర్కొన్నట్లు వేదిక తెలిపింది. ఈ మార్గదర్శకాలు జారీ చేసి మూడు నెలలైనప్పటికీ అమలులో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని తెలిపింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అర్హులైన తమ వారిని విడుదల చేస్తారని ఆశించారని, కానీ అది జరగనందున ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనతో ఉన్నారని, తెలిపింది. పై జీవో ప్రకారం జైళ్ల శాఖ ప్రతి నాలుగు నెలలకోకసారి అర్హులైన జీవిత ఖైదీల జాబితాను సిద్ధం చేసి స్టాండింగ్ కమిటీ ముందుంచాల్సి ఉంటుందని, ప్రభుత్వం అర్హులైన ఖైదీలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు ఎవరికీ సమాచారం లేదని హక్కుల వేదిక తెలిపింది. ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





