– ఆర్థిక శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖతోపాటు సంబంధిత శాఖ అధికారులతో ప్రజాభవన్‌లో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 2,813 జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన రూ.161 కోట్ల బకాయిలు ఉన్నట్టు అధికారుల సమీక్షలో నిర్ధారించారు. మొత్తం సొమ్మ్లును వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





