పంటల కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వాలి

– ‘మొంథా’తో సోయా, మొక్కజొన్న, పత్తి రైతులకు నష్టాలు
– కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 13: రాష్ట్రంలో మొంథా తుఫాను, అనిశ్చిత వాతావరణం కారణంగా సోయాబీన్‌, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నందున ఆయా పంటల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, గిరిరాజ సింగ్‌లకు లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. 3,66,697 ఎకరాల్లో సోయాబీన్‌ సాగు జరగగా సగటున ఎకరాకు 7.62 క్వింటాళ్లుగా దిగుబడి అంచనా వేశామన్నారు. కోత సమయంలో కురిసిన అకాల వర్షాల వల్ల పంటకు తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు. వర్షాల ప్రభావంతో గింజ రంగు మారడం, ముడతలు పడటం వంటి సమస్యల వల్ల పంట ఎప్‌ఏక్యూ నిబంధనలకనుగుణంగా పంట రావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో సోయాబీన్‌పై ఎప్‌ఏక్యూ ప్రమాణాలను ప్రత్యేక సందర్భంగా పరిగణించి సడలించాలని కోేరారు. ఆ ప్రకారం నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌ సంస్థలు సడలించిన నాణ్యత ప్రమాణాలకనుగుణంగా సోయాబీన్‌ కొనుగోలు చేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. మొక్కజొన్న ప్రస్తుతం 6.74 లక్షల ఎకరాల్లో సాగు ఉండగా 25 క్వింటాళ్ల సగటు దిగుబడితో సుమారు 16.85 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనా వేశామన్నారు. అయితే మార్కెట్‌లో ధర క్వింటాల్‌కు రూ.1959కు పడిపోయి కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పీ రూ.2400 రాకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి మొక్కజొన్న కొనుగోలు ఆరంభించిందని తెలిపారు. ఇప్పటివరకు 48,757 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు చేసి 14,519మంది రైతులకు ప్రయోజనం కల్పించినట్లు వెల్లడిరచారు. ఈ నేపథ్యంలో ఎంఎస్‌పీ కింద మొత్తం 16.85 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌ సంస్థలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను మంత్రి తుమ్మల కోరారు. పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ ప్రతిపాదించిన ఎకరాకు ఏడు క్వింటాళ్ల పరిమితి నిర్ణయం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ెల్‌-1, ఎల్‌-2, స్పాట్‌ బుకింగ్‌ విధానంలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు ఇది మరో రకంగా ఇబ్బంది పెట్టే చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికే ‘మొంథా’ ప్రభావంతో పత్తి దెబ్బతిన్నందున ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తేమ శాతాన్ని సడలించాలని, ఎకరాకు 11.74 క్వింటాళ్ల దిగుబడి ఆధారంగా కొనుగోలు కొనసాగించాలని మంత్రి తుమ్మల కేంద్ర టెక్స్‌టైల్స్‌ మంత్రికి మరోసారి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కొనుగోలులో ఏర్పడుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు, దిగుబడి నష్టాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది చిన్న రైతులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page