రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి

– ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల పోరుకు బీజేపీ మద్దతు
-పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్ల అసోసియేషన్ల కాలేజీల బంద్‌ పిలుపునకు బీజేపీ సంపూర్ణ మద్దతు పలుకుతోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. సోమవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ కాలేజీలకు భారీగా బకాయిలు పెరగడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ కాలేజీలు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితికి వచ్చాయని, ఇది రాష్ట్ర ప్రభుత్వ చర్య వల్ల ఏర్పడిన పరిస్థితి అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయలు రూ.8 వేల కోట్లకుపైగా ఉన్నప్పటికీ రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేకపోవడం వల్ల ప్రైవేట్‌ కాలేజీలు ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. ప్రభుత్వం ఆరు నెలలుగా ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతూ త్వరలో పరిష్కారం చేస్తాం అని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేదా పెండిరగ్‌ బకాయిలు విడుదల చేయలేదుని ఆయన అన్నారు. గఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులు ఇస్తామని వాగ్దానం చేసింది కానీ ఈ వాగ్దానం అమలు కాలేదన్నారు. విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మరింత కూలిపోయే పరిస్థితికి లోనవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రూ.1000 కోట్లు నిధులు ఇస్తామని వాగ్దానం చేశారు.. కానీ రాష్ట్రంలో రిటైర్డ్‌ టీచర్లకు పెన్షన్లు కూడా ఇవ్వని పరిస్థితి దాపురించిందని విమర్శించారు. ప్రైవేట్‌ మేనేజ్మెంట్స్‌ తీసుకున్న నిర్ణయానికి బీజేపీ పూర్తిగా మద్దతు పలుకుతోందని తెలిపారు. కొత్త యూనివర్సిటీలకు కనీసం భవన నిర్మాణాలు చేయకపోవడం సబబుకాదు. ఇప్పటికైనా అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిుల్ని వెంటనే విడుదల చేయాలి.. కొత్త భవనాల నిర్మాణం వేగవంతం చేయాలి అని డిమాండ్‌ చేశారు. విద్యా శాఖ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామని రామచందర్‌రావు చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *