హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి7: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ డా. రెహానా బేగం పద్మావతి మహిళా యూనివర్శిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జర్నలిజంలో పీహెచ్ డీ పట్టా అందుకున్నారు. ‘తెలుగు పత్రికల్లో అంతర్జాతీయ వార్తల కవరేజ్’ అనే అంశం పై ప్రొ. బి.ఎన్. నీలిమా పర్యవేక్షణలో పరిశోధన చేశారు రెహానా, వెయ్యికి పైగా తెలుగు వార్తా పత్రికల ఎడిషన్ల పై పరిశోధన జరిపి పలు కీలకమైన అంశాలను పరిశోధనా పత్రంలో రెహానా విశ్లేషించారు. ఈ పరిశోధన తెలుగు పత్రికలకు అంతర్జాతీయ ధృక్కోణం ఏ మేరకు ఉందనే అంశాన్ని లోతుగా అర్థం చేసుకోవటానికి దోహదపడుతుందని గైడ్ ప్రొ. నీలిమా పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే రెహానా పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. గత ఏడాది జూలైలో యూనివర్శిటీకి తన పరిశోధనా పత్రం పై వైవా కమిటి, అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థుల సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. రెహానా సమర్పించిన పరిశోధన పత్రం, ప్రజెంటేషన్ పై సంతృప్తి చెందిన కమిటి అప్పుడే యూనివర్శిటీకి పీహెచ్ డీ అవార్డుకు సిఫార్సు చేసింది. ఇవాళ జరిగిన యూనివర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పీహెచ్ డీ పట్టా అందుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్ రెహానాకు పలువురు అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





