– కలెక్టర్‌తో మాట్లాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
- రైతులకు అన్యాయం చేస్తే మరో లగచర్ల అంటూ హెచ్చరిక
వికారాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18: రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్రంగా స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు మారుస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. అలైన్‌మెంట్‌ను మార్చి రోడ్డు నిర్మాణం చేపడితే మరో లగచర్ల ఘటన రిపీట్ అవుతుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కేటీఆర్ హెచ్చరించారు. గతంలో ఆమోదించిన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం అలైన్‌మెంట్‌ని మార్చి సర్వే నెంబర్లను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది.అయితే, గతంలో నిర్మించ తలపెట్టిన మార్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉండటంతో అలైన్‌మెంట్‌ను మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలైన్‌మెంట్ మార్పుతో రైతులు భారీగా భూములు కోల్పోతున్నారు. ఈ విషయంపై వారం రోజులుగా వివిధ పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేశారు అన్నదాతలు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ను కలిశారు. మోన్‌పేట మండల గ్రామాల రైతులు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో ఫోన్‌లో మాట్లాడారు కేటీఆర్. పేద రైతుల భూములను గుంజుకొని వారికి అన్యాయం చేస్తే మరో లగచర్ల ఘటన చోటు చేసుకుంటుందని కలెక్టర్‌ను హెచ్చరించారు. అయితే, కలెక్టర్‌ను హెచ్చరించిన వీడియో వికారాబాద్ జిల్లా వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





