– సౌదీ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో దుర్మరణం పాలైన ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యాత్రికుల కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలను ఓదార్చి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ దురదృష్టకర సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. పార్టీ తరపున మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మృతదేహాల తరలింపు లేదా ఇతర ఏమైనా కార్యక్రమాలు చేయాల్సి ఉంటే వాటిని పూర్తి చేయడానికి విదేశాంగ అధికారులతో స్వయంగా మాట్లాడతామని ఆయన తెలిపారు. మరణించిన వారి పట్ల పూర్తి శ్రద్ధ వహించడానికి ఇప్పటికే బీఆర్‌ఎస్ పక్షాన తమ బృందం సౌదీ అరేబియాకు వెళ్లిందని తెలిపారు. కేటీఆర్‌తోపాటు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి మహమూద్‌్ అలీ, యువ నాయకుడు ముఠా జైసింహ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





