– షరతులు వర్తిస్తాయన్న ఇరాన్
టెహ్రాన్, ఏప్రిల్ 1: అమెరికా` ఇజ్రాయెల్‌తో కొనసాగుతోన్న యుద్దాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. అయితే తమకు కొన్ని బలమైన హావిÖలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. యుద్ధం ముగించాలంటే తాము విధించిన షరతులకు అంగీకరించాలన్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావతం కావనే బలమైన హావిÖ ఇవ్వాలన్నారు. అప్ప్పుడు ఈ యుద్ధం ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇరాన్ అధ్యక్షుడితో జరిగిన సంభాషణ తర్వాత ఆంటోనియో కోస్టా సోషల్ విÖడియాలో పోస్టు పెట్టారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను తగ్గించుకోవాలని కోరారు. దౌత్య మార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం గురించి ప్రస్తావించారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ నుంచి తనకు నేరుగా సందేశాలు అందుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. అయితే ఆ దేశంతో చర్చలు జరుపుతున్నామనేది దాని ఉద్దేశం కాదన్నారు. విÖడియాతో మాట్లాడుతూ కొన్ని సందేశాలు మధ్యవర్తుల ద్వారా కూడా వచ్చాయన్నారు. యూఎస్‌తో తాము ఎలాంటి అధికారిక చర్చలు జరపడం లేదని, ఆ దేశం ప్రతిపాదనలపై ఇంకా స్పందించలేదని వెల్లడించారు. కాల్పుల విరమణకు తాము అంగీకరించమని, యుద్ధం ముగింపును మాత్రమే కోరుకుంటున్నామని అరాగ్చీ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



