శాసనసభలో ఏ చర్చకైనా సిద్ధం

– మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సచివాలయంలో సోమవారం తనను కలిసిన విలేకరులతో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ శాసనసభ్యులు సభకు వచ్చి తమ వాదనలు వినిపిస్తే ప్రతి విషయానికి సాక్ష్యాధారాలతో సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ, ప్రతిపక్షం ప్రజా సమస్యలను పక్కన పెట్టి తమ సొంత ఎజెండాతో సభకు వస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని ఇండ్ల నిర్వాసితులందరికీ ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, దాని ప్రకారం త్వరలో అక్కడి అర్హులందరికీ ఇంటి పట్టాతోపాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ పేదవాడి పక్షానే ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ పక్కన సంబంధం లేని క్రషర్ నాది అని చిల్లర ఆరోపణలు చేస్తున్నారు.. నాకు క్రషర్ నడిపే ఓపిక లేదు.. అది నాది కాదు అని బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. బీఆరఎస్ నేతలు చెబుతున్నది తిరుమల క్రషర్.. వేస్ట్ క్రష్ చేసి సప్లై చేసే లైసెన్స్ వారికి ఉంది.. ఆ క్రషర్ కంపెనీ మా కంటైనర్ తీసుకు వెళ్ళింది.. దానిపై ఉన్న పేరును తొలగించినట్లు ఉన్నారు.. దానిని పట్టుకుని పిచ్చి వాగుడు వాగుతున్నారు.. నాపై పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి అసెంబ్లీలో గట్టిగా సమాధానం చెబుతాను అని మంత్రి పొంగులేటి అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *