వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హన్మకొండ ఆర్డీవో రమేష్ రాథోడ్ జన్మదిన వేడుకలు లార్డ్ వృద్ధాశమంలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగాయి. వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. బెడ్ షీట్లు, పండ్లు, స్వీట్లు అందజేసి వృద్ధులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ తన పుట్టిన రోజు ఈ అనాధ వృద్ధుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని, వీరికి తనవంతు సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని వృద్ధుల పట్ల మర్యాదతో ఉండి గౌరవించాలని, ప్రతి ఒక్కరూ ప్రేమతో వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు ఏ కష్టం వచ్చినా ట్రిబ్యునల్ కోర్టును సంప్రదించవచ్చన్నారు. అనితా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఇలా అందరికీ స్పూర్తినిచ్చేలా తమ జన్మదినోత్సవాలు, ఇతర ముఖ్యమైన దినోత్సవాలను ఇలా వృద్ధులు, అనాధల మధ్య జరుపుకోవడం అభినందించదగిన విషయమన్నారు. వృద్ధుల సేవ దైవ సేవ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వల్ల వారిలో తమకు అందరూ ఉన్నారన్న భావన కల్పించిన వారమవుతామని చెప్పారు. కార్యక్రమంలో మమత, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





