– రీజినల్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజర్
– రోడ్డు నెట్ వర్క్ పై ప్రత్యేక దృష్టి అవసరం
– బడ్జెట్ ప్రపోజల్స్‌పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
హైద రాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి18: రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నదని, స్ప ష్టమైన ప్రణాళికతో వార్షిక బడెట్ అంచనాలు ఉండాలని ఆ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఏడాది బడ్జెట్, పనుల పురోగతి, విడుదలైన నిధులపై కూలంకషంగా మంత్రి చర్చించారు. రీజినల్ రింగ్ రోడ్డు లాంటి గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులపై ప్రధానం దృష్టి సారించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2047 రైజింగ్ తెలంగాణ నినాదంలో రాష్ట్ర రోడ్ నెట్ వర్క్ అభివృద్ధి అత్యంత కీలకం కానుందన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర రోడ్ నెట్ వర్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, హ్యామ్ రోడ్ల విధానంలో రాష్ట్రవ్యాప్తంగా అద్దం లాంటి రోడ్లు నిర్మించబోతున్నాం, ఇప్పటికే ఉన్న బాలారిష్టాలు దాటేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని చెప్పారు. అధికారులు కూడా మనసు పెట్టి పనిచేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై కన్ఫ్యూజన్ లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. హైదరాబాద్-విజయవాడ (ఎన్ హెచ్ 65) ఎనిమిది లేన్ల విస్తరణ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని, పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మరోసారి కోరతానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ నుండి విజయవాడ రెండున్నర గంటల్లో చేరుకోవచ్చునన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా కేంద్ర సహకారం అందించే ప్రాజెక్టుల్లో వేగం పెంచాలని కేంద్ర మంత్రులను కలుస్తానని కోమటిరెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





