ఆర్‌అండ్‌బీ బలోపేతంపై దృష్టి పెట్టండి

– పూర్తి పారదర్శకంగా పదోన్నతులు కల్పించాం
– శాఖాపరమైన సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి
– ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఒప్పించి ఆర్‌అండ్‌బి శాఖలో ఏళ్లతరబడి పెండిరగ్‌లో ఉన్న సర్వీస్‌ రూల్స్‌ అప్రూవల్‌ చేసుకొని రెగ్యులర్‌ ప్రమోషన్స్‌ వచ్చేలా కృషి చేశానని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ఎన్నికైన ఆర్‌అండ్‌బి ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం క్యాంపు కార్యాలయంలో గురువారం తనను మర్యాదపూర్వకంగా కలిసినపుడు కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తనను కలిసి వినతులు ఇచ్చినప్పుడు మీకు తప్పకుండా ప్రమోషన్స్‌ వచ్చేలా చేస్తానని చెప్పానని, ఆ మాట ప్రకారం ఒకేసారి 118 మంది ఏఈఈలకు డీఈలుగా, 72మంది డీఈలకు ఈఈలుగా, 29మంది ఈఈలకు ఎస్‌ఈలుగా, ఆరుగురు ఎస్‌ఈలరు సీఈలుగా, ఇద్దరు సీఈలకు ఈఎన్‌సీగా పదోన్నతులు ఇచ్చామని గుర్తు చేశారు. ఏ శాఖలో లేని విధంగా రోడ్లు భవనాలు శాఖలో పూర్తి పారదర్శకతతో ప్రమోషన్స్‌ ఇచ్చామన్నారు. శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చి మీరు అడిగినవన్ని చేస్తున్నది మరింత ఉత్సాహంతో పనిచేస్తారనే నమ్మకంతోనేనని, ఆ నమ్మకాన్ని నిలబెడుతూ శాఖ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. శాఖాపరమైన, ఆమోదయోగ్యమైన సమస్యలు ఏమున్నా తన దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇతర కేడర్లలో మిగిలిన పదోన్నతులను కూడా త్వరితగతిన పూర్తిచేస్తామని చెప్పారు. కాగా, మీరు ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి అయిన తర్వాతనే తమ సమస్యలు పరిష్కారమై, రెగ్యులర్‌ ప్రమోషన్స్‌ వచ్చాయని మంత్రి వెంకట్‌రెడ్డికి అసోసియేషన్‌ ప్రతినిధులు తమ అభిమానాన్ని, కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. మంత్రిని కలసిన వారిలో ఆర్‌అండ్‌బి ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు ఎన్‌.శ్రీను, జనరల్‌ సెక్రటరీ బి.రాంబాబు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.శరత్‌చంద్ర, ట్రెజరర్‌ మహేందర్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్లు కె.సంధ్య, వేణు, ప్రదీప్‌ రెడ్డి, జాయింట్‌ సెక్రటరీలు నవీన్‌, కిషన్‌, అరుణ్‌రెడ్డి, పలువురు ఇంజనీర్లు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *