మహిళలతో పెట్టుకుంటే అంతే సంగతులు

– కేటీఆర్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క
– రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలకు హాజరు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26: ‌మహిళలతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడరని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క హెచ్చరించారు. సొంత ఇంట్లో ఆడపడచుకు న్యాయం చేయలేని వారు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్‌లో మంత్రి సీతక్క శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సొంత ఇంటి ఆడబిడ్డను గోస పెడుతున్నారని.. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఇది తగునా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా కాంగ్రెస్‌ ‌భాగస్వామ్యం కానుందని ఉద్ఘాటించారు. మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే కాక మహిళలను బస్సు ఓనర్లను చేశామని ఉద్ఘాటించారు. అభయహస్తం నిధులను బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కాజేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు. మరోవైపు రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్క•తిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం రవీంద్రభారతిలో పువ్వుల బతుకమ్మ పాటను ఆవిష్కరించారు. తెలంగాణ పర్యాటక సాంస్క•తిక శాఖ సౌజన్యంతో పువ్వుల బతుకమ్మ పాటను సంస్థ నిర్వాహకులు రూపొందించారు. సింగర్స్ ‌గడ్డం సంతోష్‌, శ్రీ‌నిధి పువ్వుల బతుకమ్మ పాటను ఆలపించగా.. నయని పావని నటించింది. ఈ సందర్భంగా సింగర్స్, ‌నాయని పావనీని మంత్రి సీతక్క, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత ఇందిరా శోభన్‌ ‌సన్మానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *