– సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యతా క్రమంలో రేషనలైజేషన్ చేసుకుని రావాలని డిప్యూటీ సీఎం, సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో మంత్రులు సబ్ కమిటీ సభ్యులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి వికమ్రార్క మాట్లాడుతూ 1:3 శాతం చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలని, ప్రతిపాదనల సంఖ్య ఎక్కువగా ఉంటే సంవత్సరాల వారీగా ప్రాధాన్యత క్రమంలో విభజన చేయాలని అధికారులను ఆదేశించారు. సూచించిన మేరకు అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా పూర్తిస్థాయి ప్రతిపాదనలతో సమావేశానికి రావాలన్నారు. హ్యామ్ రోడ్ల పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సబ్ కమిటీ సభ్యులు ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలో వచ్చిన ప్రతిపాదనలను సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వివిధ శాఖల కార్యదర్శులు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





