అరుదైన కవి అందెశ్రీ

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందెశ్రీ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అరుదైన కవి అని కొనియాడారు. ఆయనతో చాలాకాలంగా తనకు సన్నిహిత సంబంధం ఉందన్నారు. ఇటీవల దిల్లీిలో కలిసినప్పుడు ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడారంటూ ఇంతలోనే మరణ వర్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. తెలంగాణ ఉద్యమ దశలో ప్రజల్లో ఆత్మగౌరవ స్పూర్తిని రగిలించిన ఆయన రచనలు చిరస్మరణీయమన్నారు. ముఖ్యంగా ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ రాష్ట్ర గీతంగా చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోదైర్యం కలిగించాలని ప్రార్థిస్తున్నానని రాంచందర్‌ రావు తెలిపారు. లాలాపేట్‌లోని వినోద్‌ నగర్‌లోని అందెశ్రీ నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అందెశ్రీ మరణం తెంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *