– మున్సిపల్ ఎన్నికల తరవాత పన్నుపోటు
– సీఎం రేవంత్ పై ఎంపీ డీకే ఆరుణ ఆరోపణలు
మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ట్యాక్స్ పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ లేదని చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని అరుణ తెలిపారు మహబూబ్ నగర్ కార్పొరేషన్, భూత్పూర్, జడ్చర్ల మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరముందని ఎంపీ అన్నారు. మహబూబ్ నగర్ చుట్టుపక్కల గ్రామాలు విలీనమయ్యాయని ఎంపీ అరుణ వివరించారు. కార్పొరేషన్ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ కూడా అవసరం ఉందని చెప్పుకొచ్చారు. పట్టణాల్లో స్లమ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలవగానే సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన అందించడమే బీజేపీ లక్ష్యమని ఉద్ఘాటించారు. ప్రతి వార్డులో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర అంశాలపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ మేనిఫెస్టోను ప్రజలకు అనుకూలంగా తయారుచేసి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని అరుణ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





