నార్సింగ్‌లో దారుణం

– ఆరేళ బాలికపై అత్యాచారం, హత్య

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ ఇస్తానంటూ బాలికను నమ్మించి అత్యాచారం చేయడమేగాక ఆపై హత్య చేశాడు. తమ చిన్నారి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నార్సింగిలో నివసించే ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నట్లుండి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి, తన వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై దొరికిపోతానన్న భయంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు చూపిన ప్రాంతంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వేగంగా విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *