అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో రంగ్-ఏ-అరణ్య వేడుకలు

అచ్చంపేట, ప్రజాతంత్ర, మార్చి 3: హోలీ పండుగ, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘రంగ్-ఏ-అరణ్య’ పేరిట అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు పాఠశాల విద్యార్థులకు అడవిలో లభించే సహజ వర్ణాల ప్రాముఖ్యతను వివరించారు. పాల పిట్ట నీలి రంగు, పచ్చని వృక్షావరణం, పెద్ద పులి నారింజ వర్ణం, అడవి పూల రం గుల సమ్మేళనం వంటి ప్రకృతి సౌందర్యాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ మన పండుగలు ప్రకృతితో ఎంతగా ముడిపడి ఉన్నాయో వివరించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 500మంది విద్యార్థులతో శ్రమదానం నిర్వహించారు. అడవికి హానికరమైన లంటానా కలుపు మొక్కలను తొలగించి వాటితోనే సంప్రదాయ హోలికా దహన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని అధికారులు ‘ఎకాలజికల్ హోలికా’గా అభివర్ణించారు. విద్యార్థులకు వివిధ రకాలైన వన్యప్రాణులపై వ్యాస ర‌చ‌న పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఇటీవలి కాలంలో అమ్రాబాద్ అరణ్యంలో పులుల దర్శనం పెరిగిందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ కు సమీపంలో, శ్రీశైలం మార్గంలో ఉండటంతో ఇక్కడ ఎకో టూరిజం కార్యకలాపాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *