రాష్ట్రంలో రంజాన్ సందడి

– ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు
– హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ఏర్పాట్లు

హైదరాబాద్, మార్చి 21: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అల్లాహ్‌ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే రాష్ట్రంలోనూ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ముస్లింలు వివిధ ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న పిన్నా, పెద్దా త‌ర‌త‌మ భేదాలు లేకుండా ఒక‌రినొక‌రు అలాయ్ బ‌లాయ్ ఇచ్చుకున్నారు. హిందువులు కూడా త‌మ ముస్లిం మిత్రుల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద వేలాదిగా ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. చరిత్రాత్మక మక్కా మసీదులో భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ఈద్`ఉల్`ఫితర్ ప్రార్థనలు చేశారు.

పాత బస్తీలో రద్దీని దృష్టిలో ఉంచుకుని మక్కా మసీదు పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రత్యేక ఈద్ ప్రార్థనలు, భారీ ఇఫ్తార్ విందుల కోసం పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే మీరాలం ట్యాంక్ వద్ద ఉన్న ఈద్గాలో కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, క్విక్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌లతో భద్రతను ఏర్పాటు చేశారు. రద్దీ నేపథ్యంలో మీరాలం పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈనెల 19న నెలవంక కనిపించకపోవడంతో భారత దేశంలో రంజాన్ పండుగను శనివారం జరుపుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *