– ముగిసిన ఉపవాసాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. చివరి శుక్ర వారం దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. గురువారం నెలవంక దర్శనం లేకపోవడంతో శుక్రవారం నెలవంక ఆధారంగా శనివారం రంజాన్ పండగను నిర్ణయించారు. దీంతో నెల రోజుల ఉపవాస దీక్షలను విరమించి పండగను జరుపు కోబోతున్నారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ప్రార్థనలు ఆచరించారు. ఖురాన్ పఠించారు. ముఖ్యంగా ఈ మాసంలో దానధర్మాలు విరివిగా చేస్తారు. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ఆత్మ పరిశీలనకు, స్వీయ క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇలా నెల రోజుల ఉపవాసాల ఆనంతరం నెలవంక కనిపించిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అతిముఖ్యమైన పండుగల్లో రంజాన్ అత్యంత ప్రధానమైనది. ఎంతో భక్తిశ్రద్ధలతో, నియమనిష్ఠలతో రంజాన్ పండుగను ఆచరిస్తారు. ముస్లింలు ఆచరించే చాంద్రమాన క్యాలెండర్‌లో రంజాన్ లేదా రమాదన్ అనేది తొమ్మిదో నెల. ఈ రంజాన్ పండుగ ఆధ్యాత్మిక చింతన, దానధర్మాలు, క్రమశిక్షణ వంటి వాటికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ రంజాన్ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించిందని ముస్లిం పండితులు చెబుతారు. సాధారణంగా సౌదీ అరేబియాలో నెలవంక కనపించిన తర్వాతి రోజు భారత్‌లో రంజాన్ మాసం ప్రారంభం కావడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఇక రంజాన్ పండుగ 20 తేదీన నెలవంక దర్శనం ఆధారంగా జరుపుకుంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



