జీఎస్టీ తగ్గించడం చరితాత్మ్రక నిర్ణయం

 – మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: మోదీ ప్రభుత్వం వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల వేళ బహుమతిగా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం 56వ జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ సులభతరం, రేట్ల తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకుందని, దసరా, దీపావళికి ముందే పండుగ సరకులు ప్రజలకు అగ్గువకే లభించనున్నాయని తెలిపారు. పాలు, పాల ఉత్పత్తులు, పనీర్‌, హెయిర్‌ ఆయిల్‌, టూత్‌బ్రష్‌లు, సబ్బులు, షాంపూలపై జీఎస్టీ తగ్గించారన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై 18 నుండి 5%, కొన్నింటిపై 12 నుండి 5%, మరికొన్ని జీరో శాతానికి తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ఆత్మనిర్భర, అభివృద్ధిపరచిన భారత్‌ గా తీర్చిదిద్దుతోందని, కాంగ్రెస్‌ పార్టీ ఏదీ సాధించలేక ప్రధానమంత్రి మోదీపై విమర్శలు చేస్తోందిదని ఆయన ఎద్దేవా చేశారు. జీఎస్టీ తగ్గించి పండుగ సమయంలో ప్రజలకు ఊరట కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నరేంద్రమోదీ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించిందన్నారు. మహిళా మోర్చా, కిసాన్‌ మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ఆహ్వానానికి అనుగుణంగా మొజంజాహి మార్కెట్‌లో  శోభాయాత్రలో పాల్గొని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభించనున్నారని తెలిపారు. భారత్‌లో వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్‌ అమలు చేసిన తర్వాత మోదీ ప్రభుత్వం రెండుసార్లు విజయవంతంగా అధికారంలోకి వచ్చి సింప్లిఫైడ్‌ ట్యాక్స్‌ ద్వారా దేశాన్ని బలోపేతం చేసిందని రామచందర్‌రావు వివరించారు. కాగా, మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవసరమైన యూరియాను పంపిణీ చేస్తుండగా తెలంగాణలో యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్‌ ప్రభుత్వం సృష్టిస్తోందని, బ్లాక్‌ మార్కెట్‌ను అడ్డుకోలేకపోతోందని ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *