– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజల జీవనంలో ఆనందం, ఐశ్వర్యం, సుభిక్షం నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. ప్రజలే మన బలం, కార్యకర్తల ఐక్యతే మన విజయానికి పునాది అని, వినాయక చవితి పవిత్ర దినం సందర్భంగా ప్రతి బీజేపీ కార్యకర్త, నాయకుడు అందరూ ఒక విధానంతో ప్రతి ఇంటికి మంచి ఆలోచనలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకెళ్లి ప్రజల హృదయాల్లో విశ్వాసాన్ని నింపాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





