– ఆమె భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు కృషి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః అమెరికాలో హత్యకు గురైన నిఖిత కుటుంబాన్ని తార్నాకలోని వారి గృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సోమవారం రాత్రి పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన నిఖిత అక్కడ దారుణంగా హత్యకు గురవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిఖిత తన స్నేహితుడికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చిందని, ఆ డబ్బులు తిరిగి అడిగినందుకు కోపంతో ఆమెను హత్య చేసి అదే అపార్ట్‌మెంట్‌లో మృతదేహాన్ని దాచిపెట్టినట్లు తెలుస్తోందని చెప్పారు. నిఖిత హత్య ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన తరఫున, బీజేపీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. ఇదే విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో చర్చించారని, నిఖిత భౌతికకాయాన్ని స్వదేశానికి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తనతో కూడా కిషన్ రెడ్డి మాట్లాడారని, తాను స్వయంగా విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా నిఖిత భౌతికకాయాన్ని భారత దేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా ఇక్కడికి రప్పించేందుకు పార్టీ తరపున నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





