– బీజేపీి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.
హైతదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లాలోని మేడిపల్లిలో సాయి ఈశ్వర్ చారి అనే బీసీ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలంగాణలోని సామాజిక న్యాయం పూర్తిగా కూలిపోయిందనడానికి పెద్ద నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హక్కులను అమలు చేయకపోవడం, ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, వివక్షలతో తీవ్ర నిరాశ, ఆవేదనకు గురై సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. బీసీలను మోసం చేస్తూ వారి హక్కులను హరిస్తూ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారమే ఈ దారుణానికి కారణంమన్నారు. బీసీలకు సరైన అవకాశాలు, 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాటలు చెప్పి తీరా ఆ హామీని నిలుపుకోకుండా మోసం చేశారంటూ సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ వారిని నయవంచకు గురిచేస్తోందన్నారు. తమ పార్టీ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తోందిదన్నారు. ఈ దారుణానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



