– ములుగు కాంగ్రెస్ నాయకులకు రాఖీ కట్టిన సీతక్క
దిల్లీి, ఆగస్టు 7: అధికారిక సమావేశాల నిమిత్తం దిల్లీలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందస్తు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సోదరభావంతో రాఖీ పండుగను జరుపుకున్నారు. నాయకులకు స్వయంగా రాఖీ కట్టి వారిని ఆశీర్వదించి, సోదరసోదరీమణుల మద్య బంధాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీతక్క వ్యక్తిగతంగా సోదరులపై చూపుతున్న ప్రేమను ఈ సందర్భంగా అందరికీ తెలియజేశారు. రాఖీ కేవలం ఓ పండుగ మాత్రమే కాదు.. ఇది కుటుంబ బంధాలను, నమ్మకాన్ని, పరస్పర బాధ్యతను గుర్తు చేసే ప్రత్యేకమైన రోజు. అందుకే ముందుగానే నా ప్రాంత నాయకులకు రాఖీలు కట్టాను’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నాయకులు సీతక్క ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.





