Rakhi: సీఎంకు రాఖీలు క‌ట్టిన మంత్రులు సీత‌క్క‌, సురేఖ‌

–  సీత‌క్క‌  ఆశీర్వాదం  పొందిన పొన్నం 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాఖీ పర్వదినం(Rakhi festival)  సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌(CM Revanth)  నివాసంలో ఆయనకు పలువురు రాఖీ కట్టారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్‌(Brahma Kumaris) బృందం, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ సుజాత, బీసీ కమిషన్‌, విద్యా కమిషన్‌, శిశు సంక్షేమాభివృద్ధి కమిషన్‌, రైతు కమిషన్‌లకు చెందిన మహిళా సభ్యులు, కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు, ఇతర మహిళా నాయకులు సీఎం రేవంత్‌కు రాఖీలు కట్టారు. కాగా, మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఆయన సోదరులకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సీతక్కకు మంత్రి పొన్నం చీరను బహూకరించి ఆమె ఆశీర్వాదం పొందారు. సీతక్కకు పొన్నం ప్రభాకర్‌ సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. మినిస్టర్‌ క్వార్టర్స్‌లోనే అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు కూడా మంత్రి సీతక్క రాఖీ కట్టారు. సోదరి సీతక్క అంటూ ఆయన ఆత్మీయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి శ్రీధర్‌బాబుకు మంథని నియోజకవర్గ మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *