– ఆ ఇద్దరి సభ్యత్వాలపై ఆలోచించండి
– ఖర్గేను కోరిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
న్యూదిల్లీ, ఫిబ్రవరి 26: తెలంగా ణలో ఖాలీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి ఇవ్వాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం దిల్లీలో కలిశారు. ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాలీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ నాక్షి నటరాజన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడానని, వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి రాజ్యసభ ఇవ్వాలని కోరానని అన్నారు. ఇదే విషయంపై రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని కలవడానికి దిల్లీకి వచ్చానని తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని కోరానని తెలిపారు. జెట్టి కుసుమ కుమార్.. యూత్ కాంగ్రెస్ లీడర్‌గా, స్టూడెంట్ లీడర్‌గా.. కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారని ప్రస్తావించారు. జెట్టి కుసుమ కుమార్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటైర్స్ అని, వాళ్ల కుటుంబం నుంచి అంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని గుర్తుచేశారు. హనుమంతరావు తెలంగాణలో అనేక మంది ముఖ్యమంత్రులతో పని చేశారని వెల్లడించారు. మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని చెప్పుకొచ్చారు. ఆయనకు రాజీవ్ గాంధీ , సోనియాగాంధీ అవకాశాలు ఇచ్చారని తెలిపారు. వి.హనుమంతరావు చురుకైన వ్యక్తి అని, ఆయనకు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని ఖర్గేను కోరానని అన్నారు. కమిటీలో చర్చిస్తామని ఖర్గే హా ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





