– తొర్రూర్‌లో తొలి రోజున 59 ప్లాట్ల విక్రయాల ద్వారా రూ. 46 కోట్ల ఆదాయం .
– మంగళవారం మరో 104 ప్లాట్లకు బహిరంగ వేలం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధ్వర్వంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు మరోసారి మంచి స్పందన వచ్చింది. నగర శివారు ఓఆర్ ఆర్‌కు సమీపంలోని తొర్రూర్, కుర్మల్‌గూడ, బహదూర్‌పల్లి, ప్రాంతాల్లోని 163 ప్లాట్లకు సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగే ఈ వేలంలో తొలి రోజున తొర్రూర్‌లోని 59 ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఈ విక్రయాల్లో అత్యధికంగా చదరపు గజానికి రూ.39 వేల ధర పలికింది. మొత్తంమీద ఈ ప్రాంతంలో చదరపు గజానికి సగటున రూ.28,700 ధర పలికింది. ఇక్కడి భూములకు కనీస ధర రూ.25 వేలుగా నిర్ధారించి వేలం నిర్వహించారు. సోమవారం నాటి విక్రయాల ద్వారా మొత్తం రూ.46 కోట్ల మేర ఆదాయం వచ్చిందని స్వగృహ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతమ్ తెలిపారు. ఈ వేలం పాటలో 110మంది బిడ్డర్లు పాల్గొన్నారన్నారు. తొర్రూర్ ప్రాంతంలోని మిగిలిన 65 ప్లాట్లకు, కుర్మల్‌గూడలోని 25 ప్లాట్లు, బహదూర్‌పల్లిలోని 13 ప్లాట్లకు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





