నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు

– ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో భట్టి విక్రమార్క హావిూ ఇచ్చారని, ఇది వాస్తవమని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అయితే ఆ హావిూని అధిష్ఠానం అమలు చేయలేదని వాపోయారు. ఈ విషయంలో తనను రాష్ట్రంలోని ముఖ్య నేతలే అడ్డుకుంటూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇందులో వాస్తవాన్ని ప్రజలకు వివరించిన భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, ప్రభుత్వం అవినీతిరహిత పాలనను అందించాలని, ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని కోరుతున్నానన్నారు. తెలంగాణ సమాజం ఆకాంక్షలు నెరవేర్చేలా కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *