Rajagopal Reddy: రాజగోపాల్‌ ‌వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ‌సీరియస్‌?

-‌ సంజాయిషీ కోరనున్న disciplinaery committee

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్7: ‌మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopalreddy) వ్యాఖ్యలను పీసీసీ (PCC) క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది.మంత్రి పదవి రాకపోవడంతో ఇటీవల వరుసగా ఆయన అసహనం వెళ్లగక్కుతున్నారు. అలాగే సిఎం రేవంత్‌(Revanth)పైనా ఇష్టం వచ్చినట్లుగా మాటలు తూలుతున్నారు. తరచూ సిఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో  క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ ‌మల్లు రవి  రాజగోపాల్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడనున్నట్లు సమాచారం. తరచూ సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతోందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. ఎల్బీనగర్‌ ‌నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని.. కానీ, నియోజకవర్గ ప్రజల కోసమే మునుగోడు నుంచి పోటీ చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తనకు పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని.. అందరిలా పైరవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదని వ్యాఖ్యానించారు. మంగళవారం డియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కావాలా?మునుగోడు ప్రజలు కావాలా? అంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానన్నారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారు. పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించేవాడిని కాదు. నా స్వార్థం కోసం మంత్రి పదవిని అడగటం లేదు. మంత్రినైతే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారు. భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. పదవి ఇస్తారా? ఇవ్వరా? అనేది పార్టీ అధిష్ఠానం ఇష్టం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు, నా జూనియర్లకు కూడా ఇచ్చారు. ఎవరి కాళ్లో మొక్కి పదవి తెచ్చుకోవాలను కోవట్లేదు. దిగజారి బతకడం నాకు తెలియదు. మళ్లీ త్యాగానికైనా సిద్ధం.. ఎంత దూరమైనా మునుగోడు ప్రజల కోసం వెళ్తా. నా నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయనని అన్నారు. అంతకుముందు కూడా పలు సందర్భాల్లో సిఎం వ్యాఖ్యలను ఖండించారు. బోగస్‌ ‌జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *