రెండుసార్లు రైతు భరోసాకు ఎగనామం

– సీఎం రేవంత్‌ ‌రెడ్డి హరీష్‌రావుపై విమర్శలు

మెదక్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18: ‌రేవంత్‌ ‌రెడ్డి వచ్చాక రెండుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. వ్యవసాయానికి కరెంట్‌, ‌నీళ్లు అవసరం అయితే కాంగ్రెస్‌ ‌మాత్రం యాప్‌లు, మ్యాప్‌లు కావాలి అంటున్నదన్నారు. మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌ ‌రెడ్డి వచ్చాక బస్‌ ‌చార్జీలు రెండేళ్లలో రెండింతలు పెరిగాయి.. కాంగ్రెస్‌, ‌బీజేపీలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలు అని ఆరోపించారు. రైతులకు యూరియా సరిపడ రెండు ప్రభుత్వాలు ఇవ్వట్లేదు.. కాంగ్రెస్‌ ‌చేసే తుగ్లక్‌ ‌పనులతో కౌలు రైతులు, రైతుల మధ్య పంచాయితీ జరుగుతోందని విమర్శించారు. ఎరువుల కోసం యాప్‌ ‌తెచ్చి రైతులను కాంగ్రెస్‌ ‌పార్టీ మోసం చేస్తున్నన్నారు. సింగూరు ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతులకు క్లారిటీ ఇవ్వాలని, ఒకవేళ నీళ్లు ఇవ్వకుంటే ప్రకటన విడుదల చేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌పాలనలో రైతులకు అడుగడుగునా కష్టాలే.. ఈ రోజు వరకు కూడా 40 శాతం రైతులకు మాత్రమే రుణ మాఫీ జరిగిందని చెప్పారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతు అంశాల్లో ఫెయిల్‌ అయ్యిందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ‘యాసంగి రూ.1200 కోట్ల బోనస్‌, ‌వర్షాకాలం రూ.600 కోట్ల బోనస్‌ ‌ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు.. మెదక్‌ ‌రైతులు అగమ్యగోచరంగా ఉన్నారు.. ఘనపురం అనకట్ట నుంచి యాసంగి పంటకు నీళ్లు ఇస్తారా లేదా క్లారిటీ లేదు.. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరిట నీళ్లు ఖాళీ చేస్తున్నారు.. గత వేసవిలో ప్రాజెక్టు మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా చేయలేదు.. ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.. సింగూరు ప్రాజెక్టు ఉమ్మడి మెదక్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లాలో వ్యవసాయానికి జీవనాధారం.. పదేళ్ల పాలనలో బోరు బండ్లు లేవు.. ఇప్పుడు మళ్ళీ బోరు బండ్లు వచ్చాయి..‘ అని వ్యాఖ్యానించారు.

——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *