అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 18: హైదరాబాద్‌లో భారీ వర్షం నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండిఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.





