– హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
– హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 10: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. వచ్చే నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఆదిలాబాద్, కుము రంభీం, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో పలు చోట్ల.. గురువారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందన్నారు. దీంతో పలు జిల్లా లకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జోగులాంబ జిల్లాలో ఇవాళ సాయంత్రం పిడుగుపాటు-కు ముగ్గురు కూలీలు మృతి చెందారు. బుధవారం సాయంత్రం సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతంలో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత వాతావరణంతో ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.
భారీ వర్షంతో రహదారులపై నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పత్తి చేలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి
అలంపూర్,ప్రజాతంత్ర,సెప్టెంబర్10: జోగు లంబ గద్వాల్ జిల్లాలో అయిజ మండలం భూంపురంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం పత్తి పొలంలో పనులు చేసుకు ంటున్న వారిపై పిడుగు పడింది. ఈ ఘట నలో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి అక్కడి• •క్కడే మరణించారు. ఇద్దరికి తీవ్ర గాయా లయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పం దించి.. వారిని గద్వాల్ జిల్లా హాస్పిటల్‌కి తరలి ంచారు. వారి పరిస్థితి ఆందో ళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులు సాభాగ్య (40), పార్వతి (22), సర్వేష్ (20)గా గుర్తించారు.