– మరో నాలుగు రోజులు వానలు కురిసే అవకాశం
– పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26 : రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో వాతావరణం మళ్లీ మార్పులకు లోను కానుంది. మ్యాప్‌లో తక్కువ పీడన ప్రభావంతో ఎరుపు రంగులో గుర్తించిన జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే నీలి రంగులో గుర్తించిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోరాగల ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నా యని వాతావరణ కేంద్రం హెచ్చరిం చింది. ఒడిశా తీరాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడిం చింది. తుఫాను ప్రసరణ సముద్రమట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్త రించి ఉందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి వైపు నకు వంగి ఉందని.. పశ్చిమ వాయువ్య దిశ గా కదిలి రాబోయే రెండురోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసి ఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ల్లో భారీ వర్షాలు పడుతాయని.. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. శుక్ర వారం ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, హైద రాబాద్, జగిత్యాల, జనగాం, భూ పాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మే డ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజ న్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, భువన గిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపా లపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ముందుగానే ప్రణాళికలు వేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.



