నగరంలో మరోమారు భారీ వర్షం

– లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరదనీరు
– వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 18: ‌నగరంలో మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది.  బుధవారం రాత్రికురిసిన వర్షం నుంచి తేరుకోక ముందే గురువారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, ‌ఫిల్మ్‌నగర్‌, ‌యూసుఫ్‌గూడ, అర్‌పేట్‌, ‌పంజాగుట్ట, మాదాపూర్‌ ‌తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఐటీ కారిడార్‌తో పాటుపలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. మరికొన్ని గంటలపాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేందుకు అవకాశముండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ‌పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్‌, ఎ‌ర్రగడ్డ, యూసఫ్‌గూడ, అర్‌పేట, బోరబండ, చార్మినార్‌ ‌తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటించింది. కామారెడ్డి, మెదక్‌, ‌సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌, ‌సూర్యాపేట, నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. గంటలకు 30 నుంచి 40 కిలోటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *