‌హైదరాబాద్‌లో మరోమారు భారీ వర్షం

-ప‌లు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన‌
– అప్రమత్త‌మైన‌ సహాయక బృందాలు
–  వ‌చ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు
-వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్11: ‌హైదరాబాద్‌ ‌నగరంలో సోమ‌వారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నల్లని మేఘాలు ఆవరించింది నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ‌పంజాగుట్ట, అర్‌పేట్‌, ఎస్ఆర్‌నగర్‌, ఎ‌ర్రగడ్డ, మూసాపేట్‌లో భారీ వర్షం ప‌డింది. కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌లో మోస్త‌రు వర్షం కురిసినట్లు సమాచారం. వర్షాలతో ఎక్కడికక్కడ మెట్రో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో మాన్సూన్‌ ‌బృందాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు బయటకు రావద్దని మరోమారు హెచ్చరికలు చేశారు. వచ్చే నాలుగైదు రోజులు భారీ అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న క్రమంలో జిల్లా యంత్రాంగంతో పాటు హైదరాబాద్‌ అధికారులను అలర్ట్ ‌చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళద్దని సూచించింది.ఇప్పటికే  జిహెచ్ఎం‌సి హైడ్రా మాన్సూన్‌ ‌డిఆర్ఎఫ్‌, ‌పోలీస్‌, ‌ట్రాఫిక్‌ ‌కి వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ముప్పు ప్రాంతాలు, లోతట్టు- ప్రాంతాలు, మూసి పరీవాహక ప్రాంతాలు  ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. రానున్న నాలుగైదు రోజులపాటు- హైదరాబాద్‌ ‌తో పాటు- తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరిత ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో 13వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 13, 14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 14వ తేదీ ఒకటి రెండు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఇదిలా ఉండగా సోమ‌వారం భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్‌, ‌కొమరం భీం ఆసిఫాబాద్‌,  ‌హనుమకొండ, వరంగల్‌, ‌మహబూబాబాద్‌,  ‌జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌ ‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగతా అన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది . ఈ క్రమంలో మంగళవారం 12 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌ ‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *