హైదరాబాద్‌లో వర్షం

– బంజారాహిల్స్‌, కూకట్‌పల్లిలో కుంగిన రోడ్లు
– కుంగిన ప్రదేశంలో దిగబడిన వాటర్‌ ట్యాంకర్‌
– కూకట్‌పల్లిలో ట్రాఫిక్‌ జాం, పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 5: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మియాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మదీనాగూడ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎర్రగడ్డ, బోరబండ, సనత్‌నగర్‌, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో వర్షం పడిరది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ జాం అయ్యింది. వర్షం కారణంగా బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 12లో విరించి హాస్పిటల్‌ సమీపంలో రోడ్డులో కొంత భాగం కుంగిపోవడంతో వాటర్‌ ట్యాంకర్‌ అందులో పడిపోగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బంజారా సరస్సు/అంతగనికుంట నుండి ప్రారంభమయ్యే పురాతన కాలువపై ఈ సంఘటన జరిగింది. డ్రైనేజీపై ఉన్న కాంక్రీట్‌ కవర్‌లోని ఒక భాగం కుంగగా ఆ ప్రదేశంలో నాలా పైప్‌లైన్‌ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. కాగా, సోమవారం కురిసిన వర్షానికి కూకట్‌పల్లి జాతీయ రహదారిపై ముస్లిం గ్రేవ్‌యార్డు వద్ద ఉన్న మ్యాన్‌హోల్‌తోపాటు రోడ్డు కుంగింది. దీంతో రహదారిపై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులెదురయ్యాయి. ఉదయం నుంచి ట్రాఫిక్‌ జాం అయింది. అదే రహదారిపై పోలీసు స్టేషన్‌ ముందు డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. ఫలితంగా స్టేషన్‌ నుంచి వై జంక్షన్‌ వరకు మురుగు నీరు ప్రవహిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *